పేద దేశాలకు కోటి డోసుల వ్యాక్సిన్ ఇవ్వండి : డబ్ల్యూహెచ్ఓ చీఫ్

జెనీవా : సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు. 2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. ఈ సందర్భంగా టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ.. పేద దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన కొవాక్స్ పథకాన్ని ప్రారంభించిందని, దీనికి టీకాల సరఫరా సమస్యల కారణంగా జాప్యం జరుగుతుందన్నారు. అయితే 36 దేశాల్లో ప్రజలకు ఇచ్చేందుకు ఒక్క డోసు కూడా అందలేదని, రాబోయే రెండు వారాల్లో 16 దేశాలకు మొదటి డోసు అందనుందని తెలిపారు. మిగతా 20 దేశాలకు వ్యాక్సిన్లు అవసరమని, సంపన్న దేశాలు వ్యాక్సిన్‌ను విరాళంగా అందజేస్తే రాబోయే రెండు వారాల్లో ఆయా దేశాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు టీకాలు వేయవచ్చని టెడ్రోస్ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

