Shivon Zilis: మస్క్‌ను కలిసిన మోదీ.. ఆ భేటీలో పాల్గొన్న శివన్ జిలిస్ ఎవరో తెలుసా?
Shivon Zilis: ఎలన్ మస్క్ పార్ట్నర్ శివన్ జిలిస్.. మోదీతో జరిగిన భేటీకి హాజరయ్యారు. భారతీయ సంతతి మూలాలు ఉన్న ఆమె.. మస్క్ కంపెనీలో పనిచేస్తున్నది. శివన్ జిలిస్ తల్లి పేరు శారద.
వాషింగ్టన్: టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్‌ను ప్రధాని మోదీ కలిశారు. అమెరికా టూర్ వెళ్లిన మోదీ.. అక్కడ మస్క్‌తో భేటీ అయ్యారు. అయితే బ్లెయిర్ హౌజ్‌లో జరిగిన భేటీలో ముగ్గురు పిల్లలతో పాటు శివన్ జిలిస్(Shivon Zilis) అనే మహిళ కూడా పాల్గొన్నది. మస్క్ పార్ట్నర్ శివన్ జిలిస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. మస్క్‌కు చెందిన బ్రెయిన్ చిప్ స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్‌లో ఉన్నతశ్రేణి ఉద్యోగం చేస్తోంది శివన్ జిలిస్. కానీ చాన్నాళ్ల నుంచి ఆమె గురించి ఎవరికీ తెలియదు. గడిచిన ఆర్నెళ్లలో ఆమె మస్క్‌తో కలిసి కనిపించడం ఇది రెండోసారి.
శివన్ జిలిస్ వయసు 39 ఏళ్లు. కెనడాలో పుట్టిందామె. యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె తల్లి భారతీయ సంతతి వ్యక్తి. ఆమె పేరు ఎన్ శారద. శివన్ జిలిస్ తండ్రి పేరు రిచర్డ్ జిలిస్. అతను కెనడా దేశస్థుడు. న్యూరాలింక్ కంపెనీలో ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా జిలిస్ పనిచేసింది. 2017 నుంచి 2019 వరకు టెస్లా కంపెనీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా చేసిందామె. సామ్ ఆల్ట్‌మాన్‌కు చెందిన ఓపెన్ఏఐ కంపెనీకి అడ్వైజర్‌గా కూడా చేసింది. బ్లూమ్‌బర్గ్ బీటా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ బృందంలో ఫౌండింగ్ మెంబర్‌గా ఉన్నది.
శివన్ జిలిస్.. 2015లో.. ఫోర్బ్స్ అండర్ 30 లిస్టులో చోటు సంపాదించింది. లింక్డిన్ అండర్35లో కూడా ఆమె పేరు ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం ఎలన్ మస్క్ పార్ట్నర్గా శివన్ జిలిస్‌ను గుర్తిస్తారు. ఆ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2021లో ఇద్దరు జన్మించారు. 2024లో మూడవ బిడ్డకు జన్మనిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ జంట తమ రిలేషన్ గురించి అధికారిక ప్రకటన చేయలేదు. తన 11 మంది పిల్లల కోసం నిర్మించిన టెక్సాస్ కాంపౌండ్‌లోకి శివన్ జిలిస్ వెళ్లినట్లు తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్‌లో మస్క్‌తో కలిసి శివన్ జిలిస్ కనిపించింది. ట్రంప్‌కు చెందిన మారా లాగో ఎస్టేట్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

