నవీద్ బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్ రాజ్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఇంటి నెం.13’. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా నిర్మిస్తున్నారు. పన్నా రాయల్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ‘ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందించాం, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది’ అని దర్శకుడు అన్నారు. ఈ సినిమాకు సంగీతం : వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ : పీఎస్ మణికర్ణన్.