తొలి సంధ్యలో.. పూలరాగాల తేనెగీతాలు వినాలన్న తీయని కోరిక చాలా మందికి ఉంటుంది. అందుకే పచ్చదనంలో మునిగిపోయి పరవశించిపోయేందుకు పచ్చికబయలు లాంటి పెరడు లేకపోయినా, నచ్చిన చోట ముచ్చటైన పూలకుండీలు వేలాడదీసుకుని మురిసిపోతుంటారు.
అలాంటివారికి అచ్చంగా అందమైన విరి చెండునో, పూల గుత్తినో పెంచుకున్నామన్న ఆనందానుభూతిని కలిగిస్తాయి పిటూనియా మొక్కలు.
రకరకాల రంగుల్లోని ఈ మొక్కలు చలికాలంలో మాత్రమే విరగబూస్తాయి. వాటిని కలగలుపుగా ఒక చోట చేర్చి పెంచితే మంచు తెరలకు స్వాగతం పలికే పుష్పగుచ్ఛాల్లా అందంగా కనిపిస్తాయి. ఆనందాల విందు చేస్తాయి.