టెల్ అవీవ్, మార్చి 24: ఒక భద్రతా మండలాన్ని సృష్టించేందుకు తమ సైన్యం దక్షిణ లెబనాన్ను లిటానీ నది వరకు ఆధీనంలోకి తీసుకుంటుందని ఇజ్రాయెల్ మంగళవారం ప్రకటించింది. ‘సరిహద్దుకు చుట్టుపక్కల ఉన్న 30 కి.మీ ప్రాంతాన్ని లిటానీ నది వరకు మేము ఆధీనంలోకి తీసుకుంటాం. ఉత్తర వాసుల భద్రతకు హామీ లభించే వరకు నిరాశ్రయులైన లెబనాన్ వాసులు ఈ నదీ దక్షిణ ప్రాంతానికి రావడానికి అంగీకరించం’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ను ఉటంకిస్తూ ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది.