హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఇంటర్, టెన్త్ వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల ఫీజులు తామే చెల్లించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ, జడ్పీహెచ్ఎస్, కేజీబీవీలు, మాడల్ స్కూల్ విద్యార్థుల ఫీజు లు తామే కడతామని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కేబీబీవీల్లో క్యాంపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.