త్వరలో మార్కెట్లోకి…వోక్స్ వ్యాగన్ న్యూ వెహికల్..

ముంబై,జూన్ 29: వోక్స్ వ్యాగన్ బ్రాండ్ నుంచి “టైగన్ మిడ్-సైజ్ ఎస్యూవీ” పేరుతో అతి త్వరలోనే ఇండియా మార్కెట్లోకి రానున్నది. మార్చినెలలో వోక్స్వ్యాగన్ ఈ కారును భారత మార్కెట్లోకి అధికారికంగా ఆవిష్కరించింది. అయితే కరోనా సెకండ్ వేవ్కారణంగా దీని విడుదల ఆలస్యమైంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వోక్స్ వ్యాగన్ తమ టైగన్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నది. తాజాగా కొత్త వోక్స్ వ్యాగన్ టైగన్‌కు సంబంధించిన ఓ టీజర్ వీడియోని కంపెనీ విడుదల చేసింది.
వోక్స్ వ్యాగన్ ఇండియా 2.0 ప్లాన్ ప్రాజెక్టులో భాగంగా వస్తున్న మొట్టమొదటి మోడల్ ఈ టైగన్ ఎస్యూవీ. స్కొడా కుషాక్ ఎస్యూవీ మాదిరిగానే టైగన్ ఎస్యూవీ తయారీలో కూడా ఎక్కువ భాగం లోకలైజేషన్ ఉంటుంది. ఫలితంగా మార్కెట్లో దీని ధర కూడా చాలా పోటీగా ఉండే అవకాశం ఉంది.రూ.10.49 లక్షల (1.0 లీటర్ టిఎస్, మ్యాన్యువల్) ప్రారంభ ధరతోనే స్కొడా తమ కుషాక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ (1.5లీటర్ టిఎస్ఐ 7డిఎస్జి ఆటోమేటిక్) ధర రూ.17.59లక్షలు (రెండు ధరలు,ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.
ఈ నేపథ్యంలో కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్యూవీ ధరలు కూడా ఇంచు మించు ఇదే రేంజ్లో ఉంటాయని సమాచారం. అంతేకాకుండా, స్కొడా కుషాక్ , వోక్స్ వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలను రెండింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్న నేపథ్యంలో వీటి కొలతలు,ఈ రెండు కార్లలో లభించే ఫీచర్లు,పరికరాలు,విడిభాగాల్లో కూడా చాలా వరకూ పోలికలు ఉండే అవకాశం ఉంది. వోక్స్ వ్యాగన్ టైగన్ డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో క్రోమ్ ప్లేట్‌తో కూడిన పెద్ద గ్రిల్, ఎల్ఈడి డిఆర్ఎల్స్తో కూడిన హెడ్‌లాంప్స్,17 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో టైగన్ బూట్ లిడ్ పొడవు అంతటా ఉంజే పెద్ద లైట్ బార్ ,ఈ లైట్ బార్లో విలీనం చేసినట్లుగా ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్,వాటి మధ్యలో ఫోక్స్‌వ్యాగన్ బ్యాడ్జ్ మొదలైన అంశాలను గమనించవచ్చు.
ఇంటీరియర్స్… ప్రీమియం లుకింగ్ క్యాబిన్ లేఅవుట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఇంజన్ స్టార్ట్- స్టాప్ ఫీచర్ మరియు ఆపిల్ కార్ప్లే,ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సపోర్ట్ వంటి లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
సేఫ్టీ పరంగా … ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు,ఈబిడి,ఈఎస్సితో కూడిన ఏబిఎస్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, స్కొడా కుషాక్ ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్లనే ఈ టైగన్ ఎస్‌యూవీలోనూ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్,1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండన్నాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్,7 స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | ‘ఫేక్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్.. కెరీర్‌ను ముగించారంటూ విమర్శలు!
Road accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మంది ప్రయాణికులకు గాయాలు..!
Psoriasis | సోరియాసిస్, ఎగ్జిమా.. రెండింటి మధ్య తేడాలేమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..?
Sharukh Khan | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. ‘కింగ్’ నుంచి తొలి పాట విడుదల, రొమాన్స్‌తో పాటు యాక్షన్ అదుర్స్
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

