Vishwak Sen | ది బర్త్ డే బాయ్ టీమ్ కు షాకిచ్చిన విశ్వక్ సేన్!
ఈ సినిమా దర్శకుడు విస్కీ ఆయన జీవితంలో తొమ్మిది సంవత్సరాల క్రితం తన స్నేహితులకు జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథ రాసుకోని ఈ సినిమాను తీయడం జరిగిందని అన్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదొక కామెడీ డ్రామా.
నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ది బర్త్ డే బాయ్. ఈ చిత్రానకి విస్కీ దర్శకత్వం వహించాడు. బొమ్మాబొరుసా పతాకంపై ఐ.భరత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవికృష్ణ , సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు విస్కీ ఆయన జీవితంలో తొమ్మిది సంవత్సరాల క్రితం తన స్నేహితులకు జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథ రాసుకోని ఈ సినిమాను తీయడం జరిగిందని అన్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదొక కామెడీ డ్రామా.
ఎమ్.స్ చదవడానికి విదేశాలకు వెళ్ళినపుడు అక్కడ తన స్నేహితులకు జరగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా వాళ్ళు ఎదురుకున్న అనుభవాలు, పర్యవసానాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయని విస్కీ అన్నారు. ఈ నెల 19 న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ చాలా వినూత్నంగా ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం పబ్లిసిటీ చాలా డిఫెరెంట్ గా చేస్తున్నారు ఈ చిత్ర బృందం. అన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రమోషన్స్ జరుపుకుంటున్నారు. ది బర్త్ డే బాయ్ సినిమా దర్శకుడు ముసుగు ధరించి అన్నీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. దీనికి కారణం తను సినిమా దర్శకుడు అవ్వడం వాళ్ళ ఇంట్లోవాళ్ళకి ఇష్టం లేకపోవడం.
ఈ సినిమా సక్సెస్ అయితే తను ముసుగు తొలగిస్తానని ,తన అసలు పేరు కూడా దాచిపెట్టి విస్కీ అనే పేరు పెట్టుకున్నాడు. ఈ సినిమా విడుదల తరువాత తన అసలు పేరుతో ముసుగు తీసేస్తారట. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కి గెస్ట్ ఎవరాని చూస్తే ఆ చిత్రంలో నటించిన నటులే పెద్ద హీరోలా మాస్క్ లు ధరించి వాళ్ళ లాగే ఇమిటేట్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఈ ఫంక్షన్ జరిగే సమయంలో ఇంకో సినిమా ఫంక్షన్ కి ప్రసాద్ ల్యాబ్‌కి గెస్ట్ లా వచ్చి వెళుతున్న విశ్వక్ సేన్ ` ది బర్త్ డే బాయ్` కాన్సెప్ట్ నచ్చి అక్కడే వున్న ఆ సినిమా దర్శకుడు, నిర్మాతతో మాట్లాడి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు. ఈ చిత్ర యూనిట్ కు విశ్వక్ సేన్ ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఈ విధంగా ది బర్త్ డే బాయ్ చిత్రం టీమ్ కు విశ్వక్ సేన్ షాకిచ్చాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

