ప్రభుత్వ దౌత్యంతోనే వందేభారత్ సక్సెస్ : మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ: కోవిడ్19 మహమ్మారి వేళ విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్‌పై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవాళ రాజ్యసభలో ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశం ప్రకారం వందేభారత్ విమానాలను నడిపించినట్లు మంత్రి తెలిపారు. ఈ విమానాల ద్వారా సుమారు 45 లక్షల మంది విదేశాల నుంచి భారత్‌కు వచ్చినట్లు ఆయన చెప్పారు. అత్యధిక శాతం ప్రయాణికులు కేరళకు వచ్చినట్లు వెల్లడించారు. భారత సంతతి సంక్షేమ నిధి కోసం 33.5 కోట్లు వెచ్చించినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. భాగస్వామ్య ప్రభుత్వాలు లేకుంటే.. ఇంత భారీ స్థాయిలో ప్రజల తరలింపు సాధ్యం అయ్యేదికాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అద్వీతీయమైన రీతిలో దౌత్యం నిర్వహించడం వల్లే .. విదేశాల నుంచి ప్రయాణికుల తరలింపు సక్సెస్ అయినట్లు మంత్రి వెల్లడించారు. 27 దేశాల నుంచి భారతీయులను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్నవారికి ఆహార పదార్ధాలను, మెడిసిన్స్‌ను సరఫరా చేస్తున్నామని, దీని కోసం సౌదీ, ఖతార్, ఒమన్ దేశాలతో అంగీకారం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి మళ్లీ ఉద్యోగాలు కల్పించే ఎజెండాతో పనిచేస్తున్నామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

