corona | థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే మార్గం : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

శంషాబాద్ : దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యాన్మయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని స్వర్ణభారత్ ట్రస్ట్ (హైదరాబాద్)లో ఉచిత టీకాకరణ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఉషమ్మ దంపతులు ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 3 కేంద్రాలలో( హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ) ఏకకాలంలో ఈ టీకా కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 5,000 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కరోనాతో సాగుతున్న పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. దీన్ని ప్రజాఉద్యమంలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయ వంతం చేయాలని సూచించారు. దేశంలో గత ఆగస్టు లో 50 శాతం టీకాలు పూర్తి చేయడం ఎంతో గర్వకారణమని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, యోగ, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని వివరించారు. అదే విధంగా వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ ప్రభుత్వాలు, నిపుణుల సూచనలు తప్పక పాటించాలని పేర్కొన్నారు.
టీకాకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వర్ణభారత్ ట్రస్టు నిర్వహకులు, భారత్ బయోటిక్, ముప్పవరపు ఫౌండేషన్, మెడిసిటీ హాస్పిటల్స్ (హైదరాబాద్), సింహపురి వైద్య సేవాసమితి, పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్స్ వారిని అభినందిం చారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటిక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర, స్వర్ణ భారత్ ట్రస్టు చైర్మన్ కామినేని శ్రీనివాస్, హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లారెడ్డి హెల్త్సిటి చైర్మన్ భద్రారెడ్డి, ట్రిపుల్ ఒలంపియన్ ముఖేష్ కుమార్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డి, వల్లభనేని వంశీ, నెల్లూరు కలెక్టర్ శ్రీ చక్రధర్‌బాబు, స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టి ముప్పవరపు హర్షవర్ధన్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

