బీసీలను దెబ్బతీసేకుట్ర
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
- మా ఆత్మగౌరవ భవనాలపై కాంగ్రెస్ సర్కార్ పెత్తనమేంది?
- జీవో 14ను తక్షణమే సవరించాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ పెత్తనం ఉండకూడదనే ఉద్దేశంతోనే గత కేసీఆర్ ప్రభుత్వం రూ.కోట్ల విలువైన స్థలాలను కేటాయించి, కుల సంఘాల ట్రస్టుల ద్వారా నిర్వహణ బాధ్యతలను అప్పగించిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ భవన నిర్మాణాలకు పూర్తిస్థాయిలో నిధు లు విడుదల చేయకుండా, నిబంధనల పేరుతో ఆజమాయిషీ చెలాయించడం అ న్యాయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. తా జాగా విడుదల చేసిన జీవో 14లోని మార్గదర్శకాలు బీసీ కుల సంఘాల స్వయంప్రతిపత్తిని పూర్తిగా హరించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
సమాజ వికాసం, సంసృతి పరిరక్షణ, పిల్లల విద్యా ప్రయోజనాల కోసం నిర్మించిన భవనాల్లో ప్రతి చిన్న కార్యక్రమానికి అధికారుల అనుమతి తప్పనిసరి చేయడం, కమిటీల ఏర్పాటులో ప్రభుత్వ జోక్యం బీసీల స్వేచ్ఛను అడ్డుకోవడమేన ని దుయ్యబట్టారు. భూ ములు ఇచ్చామని గొప్ప లు చెప్పుకొంటూ, పండుగలు, జయంతులు నిర్వహించుకునేందుకు కూడా ఆంక్షలు వి ధించడం సర్కార్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఆత్మగౌరవ భవనాలు సమాజ సాంసృతిక కేంద్రాలుగా ఎ దగాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం తక్షణమే జీవో 14ను పునఃసమీక్షించి, బీసీ సంఘాల అభిప్రాయాలకనుగుణంగా మా ర్పులు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల అనవసర జోక్యాన్ని తొలగించి, ని ర్వహణ బాధ్యతలను కుల సంఘాల ట్ర స్టులకే అప్పగించాలని, బీసీల హకులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తమ పో రాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

