అమెరికన్ల మాస్కుల సమస్య ఇంకా తీరనట్టేనా?

వాషింగ్టన్: టీకాలు తీసుకున్నవాళ్లంతా ఇక మాస్కులు తీసిపారేయొచ్చని అమెరికాలో తెగ ప్రచారం జరిగింది. ఇదంతా విని బయటి ప్రపంచం వారు కూడా కొంచెం ఈర్ష్య పడ్డారు కూడా. అయితే ఇది అంత సులభమైన విషయం కాదని అమెరికన్లకు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తాజా మార్గదర్శకాలు ఈ చేత్తో ఇచ్చి ఆచేత్తో తీసుకున్నట్టుగానే ఉన్నాయి. పూర్తి స్తాయిలో టీకా తీసుకున్నవారు ఇళ్ల లోపల, వెలుపల మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తూనే ఎక్కడెక్కడ మాస్కులు ధరించాలో చాంతాడంత లిస్టు ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక, గిరిజన చట్టాలు, నిబంధనలు, నియంత్రణలు, అలాగే స్థానిక వ్యాపార సంస్థలు, పని ప్రదేశాల నియమాల మేరకు మాస్కులు ధరించాలని సూచించింది. సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్లీ వాలెన్స్కీ అంతకుముందు సెనేట్ కమిటీ ముందు హాజరైనప్పుడు ఇలాంటి మడతపేచీలు లేకుండా సూటిగా మాస్కు ధరించాల్సిందేనని తేల్చిచెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికైతే మాస్కు కొనసాగించాల్సిందేనని నిర్ణయించాయి. మరికొన్ని రాష్ట్రాలు సమాలోచనలు జరుపుతున్నాయి. అయితే అమెరికాలో మాస్కు విషయంలో ఒకడుగు ముందుకు రెండడుగులు వెనుకకు అన్నట్టుగా తయారు కావడానికి బలమైన కారణాలు లేకపోలేదు. అమెరికా జనాభాలో 37 శాతం జనాభాకు మాత్రమే టీకాలు పడ్డాయి. వయోజనుల్లో 40 శాతం మందికి ఇంకా కనీసం ఒక్క డోసు కూడా పడలేదు. మరి వీరంతా మాస్కును పాటించాలి అనే నిబంధనను ఎలా అమలు చేయగలం అని వాలెన్స్కీని ఓ టీవీ కార్యక్రమంలో అడిగితే వారు తమ పట్ల తాము నిజాయితీగా ఉండాలని ఆమె చెప్పడం విశేషం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

