3905 కోట్లు..8700 ఉద్యోగాలు.. హైదరాబాద్‌లో క్వాల్కమ్ విస్తరణ
సాఫ్ట్వేర్, వైర్లెస్ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం క్వాలమ్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
- అక్టోబర్‌లో ప్రారంభించనున్న ఐటీ దిగ్గజం
- అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్
- అదేబాటలో ఫిసర్, కాల్వేగోల్ఫ్ సంస్థలు
- ఆర్ అండ్ డీ, డిజిటెక్ ఆఫీసుల ఏర్పాటు
- మంత్రి కేటీఆర్ సమక్షంలో సంస్థల ప్రకటన
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సాఫ్ట్వేర్, వైర్లెస్ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం క్వాలమ్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అమెరికాలోని శాండియాగోలో క్వాలమ్ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎఫ్‌వో ఆకాశ్ పాలీవాలా, ఉపాధ్యక్షులు జేమ్స్‌జిన్, లక్ష్మీ రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్‌సింగ్ తదితర కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
హైదరాబాద్ నగరంలో వివిధ దశల్లో రూ.3,904.55 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపిన క్వాలమ్.. మంత్రి కేటీఆర్‌తో తన పెట్టుబడి ప్రణాళికను పంచుకున్నది. వచ్చే ఐదేండ్లలో తమ సంస్థ విస్తరణతో 8,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సుమారు 15 లక్షల 72 వేల చదరపు అడుగుల వైశాల్యంగల కార్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పెట్టుబడికి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్ నాటికి హైదరాబాద్‌లో తమ కేంద్రం సిద్ధమవుతుందని తెలిపింది.
ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ప్రపంచంలోనే అతి పెద్ద రెండో క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విషయాన్ని తెలిపిన కేటీఆర్, ఈ వరుసలో క్వాలమ్ చేరడంపై హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ చిప్ తయారీ రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాలమ్ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సాఫ్ట్‌వేర్‌తో పాటు వ్యవసాయ, విద్యారంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడమే తమ విస్తరణ ప్రణాళిక లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్ డివైజ్ వినియోగం, స్మార్ట్‌సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీల ప్రతినిధులు మంత్రికి వివరించారు.
ఈవీ కంపెనీ ఫిస్కర్
ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలో ప్రముఖ కంపెనీ ఫిసర్ హైదరాబాద్‌లో ఐటీ, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నది. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. లాస్ఏంజెల్స్లోని ఫిస్కర్ కార్యాలయంలో సీఈవో హెన్రీక్ ఫిస్కర్, సీఎఫ్‌వో గీతా ఫిసర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారబోతున్నదని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీని వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు తయారవుతున్నాయని, జడ్ఎఫ్, హ్యుండాయ్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా టెక్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రాధాన్యరంగంగా గుర్తించి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి డిజైన్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు హైదరాబాద్‌లో అద్భుత అవకాశాలున్నాయని, ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్ని ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. అందులో భాగస్వాములు కావాలని ఫిసర్ కంపెనీని కోరారు. మంత్రి కేటీఆర్ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిసర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తంచేస్తూ, మొబిలిటీ క్లస్టర్లో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు.
డిజిటెక్ సెంటర్ ప్రకటించిన కాల్వే గోల్ఫ్
ప్రతిష్ఠాత్మక గోల్ఫ్బ్రాండ్ కంపెనీ కాల్వే గోల్ఫ్ హైదరాబాద్‌లో డిజిటల్ సెంటర్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. కాల్వేగోల్ఫ్ వార్షికాదాయం 3.2 బిలియన్ డాలర్లు. గోల్ఫ్ క్రీడకు సంబంధించిన డాటా అనలిటిక్స్‌తో పాటు గ్లోబల్ కార్యకలాపాలకు సహకారం, టెక్ సొల్యూషన్స్‌ను అందించేందుకు డిజిటెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ సమక్షంలో మంగళవారం ఈ కంపెనీ ప్రకటించింది. లాస్ఏంజెల్స్ శివారులోని సంస్థ ప్రధాన కార్యాయంలో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, సీఎఫ్‌వో బ్రయాన్లించ్, సీఐవో సాయికూరపాటితో మంగళవారం మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. అమెరికా తరువాత హైదరాబాద్‌లో ఏర్పాటుచేయబోయే సెంటర్ అతిపెద్దదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. డిజిటెక్ సెంటర్‌తో తొలిదశలో 300 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు ఉపాధి లభించనున్నది. పెట్టుబడిపై అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తామని కాల్వే ప్రతినిధులు తెలిపారు. అనేక నగరాలను పరిశీలించాక హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్టు ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ రంగాల టెక్నాలజీ సెంటర్లు హైదరాబాద్‌లో కొలువుదీరాయని, కాల్వే ప్రకటన తర్వాత ఇతర క్రీడల టెక్నాలజీ సెంటర్లు వస్తాయనే ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. సమావేశాల్లో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, చీఫ్ రిలేషన్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఆత్మకూరి, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు.
అనేక దేశాలను పరిశీలించాకే హైదరాబాద్ ఎంపిక
ఐటీ, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకోసం ప్రపంచంలోని అనేక దేశాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలను పరిశీలించాం. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలత, ప్రభుత్వ పారదర్శక విధానాలే హైదరాబాద్‌లో ఫిస్కర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ప్రధాన కారణం. ఈ డెవలప్మెంట్ సెంటర్‌తో ఆటోమొబైల్, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన 300 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాం.
– సీఈవో హెన్రిక్ ఫిస్కర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు,తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

