హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): పేద, మధ్యతరగతి చిన్నారులకు ఉత్తమ విద్య అందించేందుకు ఏర్పాటు చేయనున్న ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ మీడియాన్ని ప్రవేశపెట్టాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొత్తగా 2,769 ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు నేపథ్యంలో ముస్లింల జనాభా ఎక్కువ ఉన్నచోట ఉర్దూ పాఠశాలలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు.