అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుత
- హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ
- కేబీఆర్ పార్కులో ప్రపంచ అటవీ దినోత్సవం
- న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌కుమార్
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి అద్భుతంగా ఉన్నదని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో సో మవారం ఉదయం నిర్వహించిన ప్రపంచ అటవీ దినోత్స వానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జస్టిస్ పీ నవీన్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారం ద్వారా జంగిల్ బచావో-జంగిల్ బడావో నినాదంతో రా ష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను చీఫ్ జస్టిస్‌కు అటవీ సం రక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ వివరించారు. అనంతరం కేబీఆర్ పార్కులో వాకింగ్ చేసిన చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర.. పార్కు నిర్వహణ బాగున్నదని ప్రశంసించా రు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు బాగున్నాయన్నారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే సరైన మా ర్గమని పేర్కొన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్, ప్లాంట్, ప్రొటెక్ట్ లన్నీ విధిగా అనుసరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంజే అక్బర్, మేడ్చల్, యాదాద్రి డీఎఫ్‌వోలు ఎం జోజి, వెంకటేశ్వర్లు, డీవీరెడ్డి, పార్క్ సిబ్బంది పాల్గొన్నారు.
మృగవని జాతీయ ఉద్యానవనంలో
రంగారెడ్డి జిల్లా అటవీ విభాగం ఆధ్వర్యంలో మృగవని జాతీయ ఉద్యానవనంలో అజీజ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించారు. అడవులు, పర్యావరణం, వాతావరణ మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో మొక్కలు నాటించి, డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో చీఫ్ కన్జర్వేటర్ సునీతాభాగవత్, రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి జానకిరామ్, శంషాబాద్ డివిజన్ ఆఫీసర్ విజయానంద్, అసిస్టెంట్ కన్జర్వేటర్ మక్సూద్, మృగవని పార్కు అధికారులు పాల్గొన్నారు.
వనాలతోనే మానవాళి క్షేమం: ఇంద్రకరణ్‌రెడ్డి
వనాలతోనే మానవాళి క్షేమంగా ఉంటుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అడవుల రక్షణ, పరిరక్షణ, విస్తరణ, మొకలు నాటడం, చెట్ల పెంపకం, వన్యప్రాణుల సంరక్షణ, జీవివైవిధ్యాన్ని కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. అడవుల పరిరక్షణలో అటవీ అధికారులు, సిబ్బం ది నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

