ఆ బౌలర్ ఇండియాకు ఆడుతాడు: గవాస్కర్
ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ ఉమ్రాన్ మాలిక్ .. ఇండియన్ టీమ్‌కు ఆడే అవకాశాలు ఉన్నట్లు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్లో తన స్పీడ్ బౌలింగ్‌తో కేక పుట్టిస్తున్న ఉమ్రాన్ మాలిక్.. ఇండియా జట్టుకు ఆడాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. కశ్మీర్లో పుట్టిన ఉమ్రాన్ ప్రస్తుతం ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్‌ను ఆడేందుకు మేటి క్రికెటర్లు తడబడుతున్నారు. ఒకవేళ ఉమ్రాన్ వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే, అప్పుడు అతన్ని ఎదుర్కోవడం కష్టమని, అలా బౌలింగ్ చేస్తే అతను ఇండియాకు ఆడే ఛాన్సు ఉన్నట్లు గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్‌తో చాలా ఆకట్టుకుంటున్నాడని, స్పీడ్ కన్నా కూడా అతని కచ్చితత్వం మరింత ఆకర్షిస్తోందని, ఉమ్రాన్లా స్పీడ్ బౌలింగ్ వేసే చాలా మంది బౌలర్లు గతి తప్పుతుంటారని, కానీ ఉమ్రాన్ చాలా తక్కువ సంఖ్యలో వైడ్ బాల్స్ వేస్తున్నాడని గవాస్కర్ అన్నారు. లెగ్ సైడ్ వేసే వైడ్ బంతుల్ని అతను కంట్రోల్ చేయగలిగితే, అప్పుడు అతను శక్తివంతమైన బౌలర్‌గా మారుతాడని, అంటే ఆ వేగంతో అతనెప్పుడూ వికెట్లను అటాక్ చేసినట్లు అవుతుందని, ఒకవేళ వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే, మాలిక్‌ను ఆడడం సులువు కాదు అని గవాస్కర్ అన్నారు. కుడి చేతితో బౌలింగ్ వేసే ఉమ్రాన్ భవిష్యత్తులో ఇండియన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- fast bowler
- Gavaskar
- ipl
- srh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

