ఉక్రెయిన్‌లో ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభం.. ఆందోళనలో మెడికల్ విద్యార్థులు
న్యూఢిల్లీ: రష్యా అటాక్ వల్ల ఉక్రెయిన్‌లో వైద్య విద్య చేస్తున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఆ దేశ వర్సిటీలు సెప్టెంబర్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసులను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ మెడికల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కొన్ని వర్సిటీలు సెప్టెంబర్ నుంచి క్లాసులు ప్రారంభించనున్నట్లు విద్యార్థులకు వెల్లడించాయి. తప్పనిసరి క్రాక్ పరీక్షను అక్టోబర్‌లో ఆఫ్‌లైన్ రీతిలో నిర్వహించనున్నారు.
మెడిసిన్, డెంటల్, ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉక్రెయిన్ రూల్స్ ప్రకారం కచ్చితంగా కేఆర్ఓకే-1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ ఇయర్ పూర్తి అయిన తర్వాత కేఆర్ఓకే-2 పరీక్ష రాయాలి. ఆ పరీక్ష పాసైతేనే డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ సర్టిఫికేషన్ వస్తుంది. గత ఆరు నెలల నుంచి క్లాసులకు దూరంగా ఉన్న విద్యార్థులకు ఇప్పుడిప్పుడే ఆఫ్‌లైన్ క్లాసులకు సంబంధించిన మెసేజ్‌లు అందుతున్నాయి.
రక్షణ కల్పిస్తామని వర్సిటీలు చెబుతున్నా.. విద్యార్థులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇండియాకు చెందిన 20 వేల మంది మెడికల్ విద్యార్థుల్ని ఉక్రెయిన్ నుంచి వెనక్కి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. భారతీయ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని ఆ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

