హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఎల్ఐసీ.. రెండు ప్లాన్ల యాన్యుటీ రేట్ల ను సవరించింది. జీవన్ అక్షయ్ VII (ప్లాన్ 857), న్యూ జీవన్ శాంతి (ప్లాన్ 858) యాన్యుటీ రేట్లను 2022 ఫిబ్రవరి 1 నుంచి సవరించినట్టు బుధవారం ఎల్ఐసీ ఒక ప్రకటన విడుదల చేసింది. న్యూ జీవన్ శాంతి రెండు యాన్యుటీ ఆప్షన్లకు సంబంధించిన కొత్త యాన్యుటీ మొత్తాన్ని ఎల్ఐసీ వెబ్సైట్లోనూ, వివిధ ఎల్ఐసీ యాప్స్‌లోనూ ఉన్న కాలిక్యులేటర్లో లెక్కించుకోవొచ్చని సంస్థ సూచించింది. జీవన్ అక్షయ్ VII (ప్లాన్ 857) కొత్త యాన్యుటీ రేట్లు కొత్తగా ప్రారంభించిన డిస్ట్రిబ్యూషన్ చానల్ కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్లు (సీపీఎస్సీ-ఎస్పీవీ), ప్రస్తుతం ఉన్న ఇతర డిస్ట్రిబ్యూషన్ చానల్స్‌లోనూ లభిస్తాయని, ఈ ప్లాన్లను ఆయా చానల్స్‌లో కొనుగోలు చేయవచ్చని సూచించింది. ఈ ప్లాన్లు ఆన్లైన్, ఆఫ్‌లైన్..రెండింటిలోనూ లభిస్తాయని పేర్కొంది.