Twins | పుట్టినప్పుడే విడిపోయిన కవలలు.. 19 ఏండ్ల తర్వాత టిక్‌టాక్ వీడియోతో కలిశారు!
వారిద్దరు కవలలు.. అనుకోని పరిస్థితుల్లో పుట్టినప్పుడే విడిపోయారు.. పక్క పక్క వీధుల్లో నివసిస్తున్నా, 19 ఏండ్ల పాటు ఒకరంటే ఒకరికి తెలియదు. తాజాగా ఓ టిక్‌టాక్ వీడియో, టీవీ షో వారిద్దరిని కలిపాయి.
Twins | న్యూఢిల్లీ, జనవరి 26: వారిద్దరు కవలలు.. అనుకోని పరిస్థితుల్లో పుట్టినప్పుడే విడిపోయారు.. పక్క పక్క వీధుల్లో నివసిస్తున్నా, 19 ఏండ్ల పాటు ఒకరంటే ఒకరికి తెలియదు. తాజాగా ఓ టిక్‌టాక్ వీడియో, టీవీ షో వారిద్దరిని కలిపాయి. బాలీవుడ్ సినిమా ‘సీత ఔర్ గీత’లా వీరి జీవితం ట్విస్టులతో సాగింది.
జార్జియాకు చెందిన కవలలు అమీ క్విటియా, అనో సార్టానియా పుట్టగానే కన్న తండ్రి వారిద్దరిని అమ్మేశాడు. ఒకే పట్టణంలో నివసించినా ఇద్దరికి ఎన్నడూ తారసపడలేదు. ఓ రోజు అమీ ఓ టీవీ షో చూస్తుండగా, తన పోలికతో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తుండటాన్ని చూసి షాక్ అయ్యింది.
ఆమె తన సోదరి అని తెలియదు. మరోవైపు, అనోకు నీలి రంగు జుట్టుతో తనలాగే ఉండే మరో అమ్మాయి టిక్‌టాక్ వీడియో షేర్ అయ్యింది. వీడియోలో ఉన్న యువతి అమీ అని నిర్ధారించుకున్నది. ఒకరినొకరు కలిసి తాము విడిపోవటానికి కారణాలు తెలుసుకొని షాక్ అయ్యారు. 2002లో వీరిద్దరికి జన్మనిచ్చిన వెంటనే తల్లి కోమాలోకి వెళ్లిపోయింది. వాళ్ల తండ్రే వాళ్లిద్దరిని వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

