సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు

హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమానికి రూ.52 కోట్లు అందించిన సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు తెలిపింది. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లు కలిసి మంత్రి కేటీఆర్ తో చర్చించి 24 గంటలు గడవకముందే పదిహేడున్నర కోట్లు మీడియా అకాడమీ ఖాతాలో జమకావడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 34.5 కోట్ల రూపాయలను జర్నలిస్ట్ సంక్షేమ నిధికి తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. మరో 17.5 కోట్ల రూపాయలను గురువారం విడుదల చేయడంతో మొత్తం సంక్షేమ నిధి 52 కోట్ల కు చేరడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు జర్నలిస్టుల పక్షపాతిలు అని మరోసారి చాటుకున్నారన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు రూ.52 కోట్ల నిధిని సమకూర్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, తెంజు అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టీయుడబ్య్లూజే హైదరాబాద్ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.యోగానంద్, యార నవీన్ కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

