Plantzma | పంటలకు ఎరువు అవసరాన్ని తగ్గించే ప్లాంట్జ్మా.. అభివృద్ధి చేసిన హైస్కూల్ స్టూడెంట్స్
పంటలపై కరువు, కాటకాల ప్రభావాన్ని తగ్గించే డివైస్‌ను తుర్కియేలోని హైస్కూల్ స్టూడెంట్స్ అభివృద్ధి చేశారు. టీమ్ సెరెస్ అనే ఐదుగురు విద్యార్థుల బృందం తమ స్వస్థలాల్లోని పరిస్థితుల నుంచి స్ఫూర్తి పొంది, ప్లాంట్జ్మా అనే పరికరాన్ని తయారు చేశారు.
- కరువు ప్రభావాన్ని తగ్గించే పరికరాన్ని అభివృద్ధి చేసిన తుర్కియే విద్యార్థులు
న్యూఢిల్లీ: పంటలపై కరువు, కాటకాల ప్రభావాన్ని తగ్గించే డివైస్‌ను తుర్కియేలోని హైస్కూల్ స్టూడెంట్స్ అభివృద్ధి చేశారు. టీమ్ సెరెస్ అనే ఐదుగురు విద్యార్థుల బృందం తమ స్వస్థలాల్లోని పరిస్థితుల నుంచి స్ఫూర్తి పొంది, ప్లాంట్జ్మా అనే పరికరాన్ని తయారు చేశారు. ఈ బృందంలోని స్టూడెంట్ బెయ్జా తెలిపిన వివరాల ప్రకారం, ఈ పరికరం తక్కువ ఉష్ణోగ్రతలోని ప్లాస్మాను ఉపయోగించుకుని, పంటలు నిలదొక్కుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది, సాగునీటిని మెరుగుపరుస్తుంది. సాగుకు ముందు విత్తనాలపై ప్లాస్మా ప్రభావం పడటం వల్ల అవి మొలకెత్తే రేటు, ఎదిగే సామర్థ్యం మెరుగుపడతాయి. అంతేకాకుండా తెగుళ్లు, పర్యావరణ ఒత్తిళ్లను తట్టుకునే సత్తా పెరుగుతుంది.
సాగు నీటిని ప్లాస్మాతో శుద్ధి చేయడం వల్ల పర్యావరణ హితకరమైన, నైట్రోజన్ పరిపుష్టమైన ఎరువుగా తయారవుతుంది. ఫలితంగా మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. తక్కువ ఉష్ణోగ్రత ప్లాస్మా పవర్‌ను ఈ ప్లాంట్జ్మా పరికరం రెండు విధాలుగా ఉపయోగించుకుంటుంది. అవి, విత్తనాలను నేరుగా శుద్ధి చేయడం, సాగు నీటిని పరోక్షంగా శుద్ధి చేయడం. దీనివల్ల రసాయన ఎరువులపై ఆధారపడటం 40 శాతం వరకు తగ్గుతుంది. పంట ఉత్పత్తులు పెరుగుతాయి. నిలకడైన సాగు పద్ధతులకు ప్రోత్సాహం లభిస్తుంది. గ్రామీణ రైతులు సులువుగా ఉపయోగించగలిగే ఈ ప్లాంట్జ్మా డివైస్ దాదాపు రూ.16,000కు అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

