Srisailam Temple | శ్రీగిరిలో మంగళవార పూజలు
Srisailam Temple | శ్రీగిరిలో మంగళవార పూజలు |

శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు నిర్వహించారు. ఆలయ క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చనలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక పూజాధి క్రతువులు నిర్వహించారు.

సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు ఫలోదకాలతోపాటు పుష్పోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. నూతన వస్ర్తాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నివేదించి, భక్తులకు దర్శనాలు కల్పించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

