తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు నేడు విడుదల కానున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అలాగే అదే నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లను మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డిప్ ద్వారా కేటాయించనుంది.
ఇక అక్టోబర్ నెలకు సంబంధించి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ తదితర సేవా టికెట్ల కోట, వాటి దర్శన కోటా టికెట్లను సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనుంది.