Munugode By polls Results | మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగుర వేసింది. మరో రౌండ్ కౌంటింగ్ మిగిలి ఉండగానే.. కూసుకుంట ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కూసుకుంట్ల గెలుపొందారు. 15 రౌండ్లు ముగిసే సరికి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 11,666 ఓట్ల ఆధిక్యం లభించింది.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. టీఆర్ఎస్ గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో డప్పులు, డాన్సులతో సందడి వాతావరణం నెలకొంది.