నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ పెద్దవూర మండలవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది.
శనివారం టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ నాయకుడు కట్టెబోయిన శివ.. నోముల భగత్‌ను కలిసి ప్రచార శైలిని వివరించారు.
ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
టీఆర్ఎస్ గెలుపే తమ లక్ష్యమని చెప్పారు. పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం కల్పించిన ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజుకు ధన్యవాదాలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి