తృణమూల్ జంప్‌జిలానీల ‘ఘర్ వాపసీ’కి క్యూ

కోల్‌కతా: మొన్నటి బంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ నుంచి అనేకమంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం సంచలనం కలిగించింది. ఇక తృణమూల్ పని అయిపోయినట్టే అనుకున్నారు. మమత దీదీ రిటైర్ మెంట్ తప్పదని కొందరు జోస్యాలు కూడా చెప్పారు. కానీ మూడోవిడత దిగ్విజయంగా నిలిచి చరిత్ర తిరగరాశారు దీదీ. ఇప్పుడు వెనుకకు వలసలు మొదలయ్యాయి. ఫిరాయింపుదారులు మరోసారి ప్లేటు ఫిరాయించి దీదీ నువ్వే దిక్కని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహా తృణమూల్ వదిలిపెట్టిన తర్వాత నీటిలోంచి బైటపడ్డ చేపలా ఉందని బేలగా మాట్లాడుతున్నారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు-రాజకీయ నేత అయిన దీపేందు బిశ్వాస్ మరోసారి తృణమూల్ జెండా పట్టుకుంటానని దీదీకి లేఖ రాశారు. సరళా ముర్మి, అమల్ ఆచార్య వంటి ఇతరులు కూడా మళ్లీ పుట్టింటికి వస్తామని సూచనలిస్తున్నారు. మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీ కూడా ఇదే బాటలో ఉన్నట్టు తెలుస్తున్నది. నేతలు మాత్రమే కాదు, ఏడెనిమిది మంది సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు-నలుగురు ఎంపీలు తృణమూల్‌లో తిరిగి చేరడంపై ఆసక్తి చూపుతున్నారని తృణమూల్ అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ మీడియాకు చెప్పారు. అయితే పార్టీకోసం కష్టపడి పనిచేసి విజయం సాధించిన కార్యకర్తల మనోభావాలు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. అందరికన్నా ముందు పార్టీని వదిలి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ కూడా వెనుకకు రావాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను బీజేపీ నాయకత్వం ఖండించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చిన్న అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శ
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

