ట్రెండింగ్‌లో కేసీఆర్, తెలంగాణ
- సోషల్ మీడియాలో ఉద్యోగాల ప్రకటన హవా
- ట్విట్టర్లో 6వేల ట్వీట్లకు తెలంగాణ హ్యాష్‌ట్యాగ్
- బీజేపీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలేవంటూ ప్రశ్నలు
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): #కేసీఆర్ #తెలంగాణ.. సోషల్ మీడియాలో హోరెత్తిన హ్యాష్‌ట్యాగ్‌లు ఇవి. ఉద్యోగాల భర్తీపై బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటన చేయగానే, ఆ పోస్టులు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ రెండు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నిలిచాయి. అన్ని సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ ప్రకటన, వివరాలు, అభినందనలు, సంబురాలు హోరెత్తాయి. తెలంగాణ హ్యాష్‌ట్యాగ్ సాయంత్రం వరకు అగ్రభాగాన నిలిచింది. ట్విట్టర్లో దాదాపుగా 6 వేల ట్వీట్లకు తెలంగాణ హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు, సీఎం కేసీఆర్ బొమ్మతో కూడిన ఫొటోలను పోస్ట్ చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికులు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. అదే సమయంలో బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏవని, ఇప్పుడు బత్తాయిలు ఏం చేస్తారని.. విమర్శిస్తూ, వ్యంగ్యంగా పోస్టులు చేశారు. సీఎం కేసీఆర్‌కు చేసిన క్షీరాభిషేకాలు, సంబురాల ఫొటోలను పెద్దఎత్తున పోస్ట్ చేశారు. మరికొందరు ఉద్యోగాల అర్హతలు, నిబంధనలు పోస్ట్ చేశారు. నిరుద్యోగ యువకులు ఇక ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని, ఇదే మంచి అవకాశం అని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

