Srisailam Temple | వైభవంగా త్రయోదశి పూజలు.. బసవన్నకు విశేష అభిషేకం
Srisailam Temple | వైభవంగా త్రయోదశి పూజలు.. బసవన్నకు విశేష అభిషేకం | త్రయోదశి తిథి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మాసోత్సవం

శ్రీశైలం : త్రయోదశి తిథి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో
సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మాసోత్సవం సందర్భంగా త్రయోదశి ప్రదోషకాలంలో పరోక్ష సేవగా శనగల బసవన్నకు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మహాసంకల్పాన్ని పఠించి, ఫలోదకాలు, పరిమళ సుగంధ ద్రవ్య జలాలు, ఆలయ గుండాల నుంచి సేకరించిన శుద్ధ జలాలతో బసవన్నను అభిషేకించారు. అనంతరం నూతన వస్త్రాలు సమర్పించి, నానబెట్టిన శనగలను నివేదించారు.

బసవన్న పరోక్ష సేవకు వివిధ దేశాల్లో ఉన్న భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని ఈవో తెలిపారు. ప్రధాన ఆలయం ఎదుటనున్న నంది మండపంలో కొలువైన నందీశ్వర స్వామిని శనగల బసవన్నగా పిలుస్తూ.. భక్తులు మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆసక్తి ఉన్న భక్తులు పరోక్ష సేవల్లో పాల్గొనేందుకు గోత్రనామాలతో tms.ap.gov.in, srisailadevasthanam.orgలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 83339 01351-6 కాల్ సెంటర్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

