టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
టామ్‌కామ్‌తో ఉద్యోగాలు కల్పిస్తామని తెలంగాణ సర్కార్ భరోసానివ్వడంతో ఆ సంస్థపై నమ్మకం పెట్టుకున్నామని, చివరికి మోసపోయామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కచ్చితంగా వస్తుందని డబ్బులు కట్టించుకొని తమను మోసం చేశారని ఆరోపించారు.
- నష్టపోయామంటూ నిరుద్యోగుల ఆగ్రహం
- రాష్ట్ర సర్కార్ భరోసాతోనే చేరినట్టు వెల్లడి
- చెల్లించిన ఫీజులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : టామ్‌కామ్‌తో ఉద్యోగాలు కల్పిస్తామని తెలంగాణ సర్కార్ భరోసానివ్వడంతో ఆ సంస్థపై నమ్మకం పెట్టుకున్నామని, చివరికి మోసపోయామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కచ్చితంగా వస్తుందని డబ్బులు కట్టించుకొని తమను మోసం చేశారని ఆరోపించారు. కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్.. టామ్‌కామ్ జర్మన్ భాషా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. చకగా శిక్షణ పొందిన వారికి మంచి ఉద్యోగాలు కల్పించే బాధ్యత టామ్‌కామ్, తనపైన ఉన్నదని చెప్పారు. అయితే అందులో శిక్షణ పొందినవారికి ఉద్యోగాలు దక్కకపోవడంతో ఇప్పుడు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రెండు రాష్ర్టాల నుంచి టామ్‌కామ్ బాధితులు వందల సంఖ్యలో ఉన్నారంటూ ఓ ఉర్దూ పత్రికతో తమ ఆవేదన పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డికి చెందిన ప్రశాంత్ కుటుంబం సంవత్సరానికి రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు సంపాదిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, కీలకమైన విదేశీ ఉపాధి కార్యక్రమాల్లో ఒకటైన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ(టామ్ కామ్) ద్వారా నడుస్తున్న జర్మన్ భాషా కార్యక్రమంలో అతను చేరాడు. దీని మొదటి బ్యాచ్ ఈ కోర్సు కోసం రూ. 4.1 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. ప్రవేశ సమయంలో జర్మన్ బి1 లెవెల్ పాస్ అయితే ఉద్యోగం ఇప్పిస్తానని హెచ్ఆర్ శ్రావణి హామీ ఇచ్చినట్టు తెలిపాడు. అయితే అతడికి ఎలాంటి ఉద్యోగం దక్కలేదని వాపోయాడు. అక్టోబర్ 2024 నుంచి జనవరి 2025 మధ్యకాలంలో టామ్ కామ్ టెక్నికల్, ఫుడ్ టెక్నీషియన్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ విభాగాల్లోని ఆస్బిల్డుంగ్ (జర్మన్ వృత్తి విద్యా శిక్షణ) కార్యక్రమాల్లో చేరిన సుమారు 70 నుంచి 75 మంది అభ్యర్థులు ఇదే తరహాలో మోసపోయినట్టు తెలిసింది. కొంతమందిని శిక్షణ ఇచ్చి జర్మనీకి పంపించామని నిర్వాహకులు సమాధానమిచ్చారని కానీ తమకు తెలిసినంతవరకు ఆ కార్యక్రమం ద్వారా ఎవరూ జర్మనీకి వెళ్లలేదని శ్రీకాంత్(24) తెలిపాడు. శిక్షణపై తమ అభిప్రాయాలను వెల్లడించిన 21 మంది అభ్యర్థుల్లో 12 మంది అదంతా బోగస్ అని చెప్పడం గమనార్హం.
హైదరాబాద్‌కు చెందిన యశ్వంత్ మాట్లాడుతూ, హెచ్ఆర్ శ్రావణి 2025 అక్టోబర్ నాటికి ఇంటర్వ్యూలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఒకటి కూడా జరుగలేదని చెప్పారు. భద్రాద్రికొత్తగూడెంకు చెందిన రమేశ్ (పేరు మార్చాం) సెప్టెంబర్ 2025 నాటికి తన బి1 మాడ్యూల్స్ పూర్తి చేశారు. అవకాశాలు పొందాలంటే రెండు మూడు నెలల్లోగా బి2 పూర్తి చేయాలని టామ్ కామ్ అధికారులు అతనికి చెప్పారు. రెండు నెలల్లో బి2 పూర్తి చేయడం ఎలా సాధ్యం? దీనికి కనీసం ఆరు నెలలు పడుతుందని అతడు తెలిపాడు. తనకు ఇంటర్వ్యూ అవకాశాలు కల్పించాలని లేదా డబ్బు వాపసు ఇవ్వాలని అతను టామ్ కామ్‌ను డిమాండ్ చేశాడు. కాగా, బి1 గ్రేడ్ సాధించిన తొలి విద్యార్థుల్లో ఒకరైన వరంగల్‌కు చెందిన హరీశ్ తన రీఫండ్ కోసం టామ్కామ్కు లీగల్ నోటీసు పంపినట్టు తెలిపాడు. అధికారులు గడువులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రచారం.. మోసం
‘జర్మనీలో మీ కలల కెరీర్‌ను నిర్మించుకోండి’ అనే నినాదంతో టామ్‌కామ్ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించింది. నెలకు సుమారు రూ. 1-1.26 లక్షలు ైస్టెపెండ్తో, సుమారుగా రూ. 2.3-2.9 లక్షలు ప్రారంభ జీతాలతో మూడేండ్ల వేతనంతో కూడిన అప్రెంటిస్షిప్లను ప్రచారం చేశాయి. కేవలం బీ1-స్థాయి జర్మన్ భాషా పరిజ్ఞానం అవసరమని నిర్వాహకులు ఈమెయిల్స్‌లో పొందుపరిచారు. బ్యాచ్ 1, 2 కోసం హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో, బ్యాచ్ 3 కోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే మొదటి బ్యాచ్ 2024 అక్టోబర్‌లో ప్రారంభమైంది. దీని రుసుము రూ. 4,10,400. ఇది నాలుగు వాయిదాలతో చెల్లించాల్సి ఉంటుంది.
దీనికి అదనంగా పరీక్ష కోసం సుమారు రూ. 20,000, బీమా కోసం రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు, వీసా కోసం రూ. 8,000 నుంచి రూ. 10,000 వరకు, విమాన ప్రయాణాల కోసం రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఖర్చులను యజమానులు తిరిగి చెల్లిస్తారని హామీ ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. భారత్-యూరప్ నైపుణ్య భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు టామ్ కామ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తెలిపిన వివరాల ప్రకారం, 70 నుంచి 75 మందిలో ఐదుగురు లేదా ఆరుగురికి 2026 ప్రారంభం నాటికి జర్మన్ యజమానుల నుంచి ఆఫర్ లెటర్లు అందాయని తెలిపారు అయితే, అవి వారి రంగాలకు, కొన్నిసార్లు వారి అర్హతలకు సంబంధం లేని ఉద్యోగాలకు సంబంధించినవి. ప్రకటనలో పేరొన్న జీతాలు ఆ ఉద్యోగాలకు ఉంటాయో లేదోనని వారు సందేహిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

