టాప్ గన్ ఫిల్మ్ ఓ ట్రెండ్. 1986లో రిలీజైన ఆ ఫిల్మ్ అమెరికన్ నేవీ పైలట్ డేరింగ్ స్టంట్స్‌తో ఆకట్టుకున్నది. ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన టామ్ క్రూజ్ ఇప్పుడు మళ్లీ తన పైలట్ స్కిల్స్‌తో థ్రిల్ పుట్టిస్తున్నాడు. తాజాగా రిలీజైన టాప్‌గన్ మావరిక్ ఫిల్మ్‌లో టామ్ క్రూజ్ మరోసారి ఫైటర్ జెట్స్తో ఆడేసుకున్నాడు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు.. ఫైటర్ పైలట్ రోల్లో కెప్టెన్ మారిక్గా క్రూజ్ ఓ రేంజ్లో పర్ఫార్మ్ చేశాడు. అద్భుతమైన విజువల్ వండర్‌గా ఈ ఫిల్మ్‌ను తెరకెక్కించారు.
కెప్టెన్‌గా టామ్ ఈ ఫిల్మ్‌లో ఓ టీమ్‌కు ట్రైనింగ్ ఇస్తాడు. బెస్ట్ పైలట్లకు ఓ ప్రాజెక్టును అప్పగిస్తారు. దాని కోసం వాళ్లకు శిక్షణ అవసరం ఉంటుంది. పైలట్లకు శిక్షణ ఇచ్చే రోల్లో టామ్ ఇరగదీశాడు. ఇక మాక్ 10 వేగంతో అతను ఫైటర్ విమానాలను నడిపిన తీరు సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఆ కాక్‌పిట్ థ్రిల్ ఫిల్మీ లవర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. యుద్ధ విన్యాసాల కోసం వాడిన మాడ్రన్ సీజీఐ టెక్నాలజీ ఓ కొత్త లోకాన్ని చూపిస్తుంది. ధ్వని కన్నా 10 రేట్ల వేగంతో యుద్ధ విమానాన్ని టామ్ నడిపిన తీరు స్క్రీన్‌పై సూపర్ ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. కష్టసాధ్యమైన ఆ స్పీడ్‌ను క్రూజ్ ఎలా అందుకున్నాడో ఆ థ్రిల్‌ను థియేటర్లోనే అనుభవించాలి.
శత్రువులు యురేనియం నిల్వలను ఓ రహస్య ప్రదేశంలో భూగర్భంలో దాడిపెడుతారు. పర్వత శ్రేణుల్లో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లి.. టాప్ గన్ టీమ్ ఆ రహస్య ప్రదేశాన్ని పేల్చాల్సి ఉంటుంది. నిజానికి శత్రువులు ఎవరన్న అంశాన్ని సినిమాలో చూపించారు. కానీ అక్కడకు వెళ్లాలంటే మాత్రం సర్ఫేట్ టు ఎయిర్ మిస్సైళ్లను దాటుకుని వెళ్లాలి. ఆ గండాన్ని దాటితేనే శత్రువుల టార్గెట్‌ను ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులో నిమగ్నమైన యువ పైలట్లకు టామ్ ట్రైనింగ్ ఇస్తాడు. ఇక ఆ సమయంలో సాగే డాగ్ ఫైటింగ్ కేక పుట్టిస్తుంది. కిరాక్ ఎక్కించే రేంజ్లో ఆ డాగ్ ఫైటింగ్ సన్నివేశాలను చూపించారు. లో ఆల్టిట్యూడ్లోనూ ఫైటర్ జెట్స్తో కనబరిచిన విన్యాసాలు తెగ టెన్షన్ క్రియేట్ చేస్తాయి. ఎఫ్-18, ఎఫ్-14, స్టీల్త్ జెట్స్, ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలతో సాగే డాగ్‌ఫైటింగ్ సన్నివేశాలు టాప్‌గన్ మూవీలో హైలెట్. జెట్ ఫైటర్ల యాక్షన్ కావాలనుకుంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా కోసం ఎఫ్-18 సూపర్ హార్నెట్స్ యుద్ధ విమానాలను కిరాయి తీసుకున్నారు. గంటకు 11 వేల డాలర్ల చొప్పున ఆ విమానాలను యూఎస్ నేవీ కిరాయి ఇచ్చినట్లు తెలుస్తోంది. పైలట్ పాత్ర పోషించిన నటులకు రియల్ టైమ్ అనుభవం కోసం ఆ విమానాలను కిరాయి తీసుకున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఆ ఫైటర్ జెట్స్‌లో ప్రతి నటుడూ విహరించినట్లు తెలుస్తోంది.