Solar Eclipse 2023 | నేడు అరుదైన సూర్య గ్రహణం.. భారత్లో కనిపిస్తుందా? లేదా?
Solar Eclipse 2023 | ఆకాశంలో నేడు (గురువారం) అద్భుతం జరగనున్నది. సూర్య గ్రహణాలు సాధారణంగా సంపూర్ణంగా, పాక్షికంగా, వలయాకారంగా ఏర్పడతాయి. కానీ ఈ ఏడాదిలో ఏర్పడుతున్న తొలి సూర్య గ్రహణం మాత్రం వలయాకార సంపూర్ణ సూర్య గ్రహణం రూపంలో దర్శనమివ్వనున్నది.
Solar Eclipse 2023 | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఆకాశంలో నేడు (గురువారం) అద్భుతం జరగనున్నది. సూర్య గ్రహణాలు సాధారణంగా సంపూర్ణంగా, పాక్షికంగా, వలయాకారంగా ఏర్పడతాయి. కానీ ఈ ఏడాదిలో ఏర్పడుతున్న తొలి సూర్య గ్రహణం మాత్రం వలయాకార సంపూర్ణ సూర్య గ్రహణం రూపంలో దర్శనమివ్వనున్నది. ఇది ప్రత్యేకమైన, అరుదైన సూర్య గ్రహణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
గ్రహణం నిప్పులు చెరుగుతూ అగ్ని వలయంలా కనబడనుండటంతో దీన్ని హైబ్రిడ్ సూర్య గ్రహణంగా పిలుస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ సూర్య గ్రహణం ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటల వరకు కొనసాగుతుంది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణ హిందూ మహా సముద్రం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ పసిఫిక్ మహా సముద్రం విస్తరించి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణాన్ని చూడగలమని చెప్తున్నారు. చంద్రుడు ప్రయాణించే మార్గంలో భారత భూభాగ ప్రాంతం దూరంగా ఉండటం వల్ల ఈ గ్రహణం భారత్లో కనిపించదని శాస్త్రవేత్తలు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

