హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్)రజతోత్సవాల ముగింపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించాలని టీజేఎఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో వేడుకలు నిర్వహించాలని కోరారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరుల స్తూపం, జిల్లా కేంద్రాల్లోని అమరవీరుల స్తూపాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.