దూరాలను కలిపే దారాలు
ఉదయమే మాట్లాడుకున్నా సాయంత్రానికంతా బోలెడంత విరహ వేదన. పక్కపక్కనే కూర్చుని ఎన్ని ఊసులు చెప్పుకొన్నా , ఓ రెండు గంటలు అవతలి ఫోన్ నుంచి మెసేజ్ రాకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. ఇక ఇద్దరూ వేరువేరు నగరాల్లో, వేరువేరు దేశాల్లో
ఉదయమే మాట్లాడుకున్నా సాయంత్రానికంతా బోలెడంత విరహ వేదన. పక్కపక్కనే కూర్చుని ఎన్ని ఊసులు చెప్పుకొన్నా , ఓ రెండు గంటలు అవతలి ఫోన్ నుంచి మెసేజ్ రాకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. ఇక ఇద్దరూ వేరువేరు నగరాల్లో, వేరువేరు దేశాల్లో, వేరువేరు ఖండాల్లో ఉంటే.. ఆ ఎడబాటును మాటల్లో చెప్పలేం. మానసికంగా ఆ దూరాన్ని పోగొట్టడానికి అనేక మార్గాలు..
గిఫ్ట్ బాస్కెట్
ప్రియమైనవారి కోసం నచ్చిన వస్తువులతో గిఫ్ట్ బాస్కెట్ తయారు చేయండి. అన్నీ ఖరీదైనవే కానక్కర్లేదు. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేసేలా ఉంటే చాలు. ఇలా చేస్తే, ఎంత దూరాన ఉన్నా మిమ్మల్ని చూసినట్టే ఫీలవుతారు.
ప్రేమలేఖ
ఇప్పుడన్నీ మెసేజ్‌లే. ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎన్ని ఊసులు చెప్పుకొన్నా.. అవన్నీ మరుసటి రోజుకు మరుగునపడిపోతాయి. కానీ ఇష్టమైన వారికి ప్రేమలేఖను పంపారనుకోండి. కలకాలం దాచుకుంటారు. మళ్లీ మళ్లీ చూసుకుంటారు. ఇష్టంగా చదువుకుంటారు. మీ భావాలన్నీ అందులో ఉంటాయి.
నచ్చిన రుచులు
ప్రేమించిన వాళ్లు కడుపునిండా తింటే ఇవతలి వాళ్లకూ ఆనందమే. అందుకే, వారికి ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయండి. తను ఆకలితో ఇంటికి వెళ్లే సమయానికి వేడివేడి భోజనం సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేయండి.
ఆన్లైన్ డేట్
ఓ వారాంతపు సాయంకాలం దూరంగా ఉన్నాసరే ఇద్దరూ పక్కపక్కనే ఉన్న అనుభూతి కలిగేలా ఆన్లైన్ డేట్‌నైట్ ప్లాన్ చేయండి. కొవ్వొత్తుల వెలుగుల మధ్య అందమైన దుస్తుల్లో ముస్తాబై అవతలి వాళ్లకు వీడియోకాల్ చేయండి. ఇద్దరూ ఒకేసారి ఆన్లైన్లో సినిమా చూడండి. కబుర్లు చెప్పుకొంటూ కాలం గడపండి. దీంతో ఒకరికొకరు దగ్గరగా ఉన్న భావన కలుగుతుంది.
ఆశ్చర్యపరచండి
మీరు ప్రేమించే వ్యక్తి సర్ప్రైజ్ను ఇష్టపడే వారైతే చెప్పాపెట్టకుండా వెళ్లి ఆశ్చర్యపరచండి. ప్రియమైన వారిని కలవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.అలా ఒక వారాంతాన్ని మధురాను భూతిగా తీర్చి దిద్దుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

