Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Tiger Shroff | ముంబైలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.
ముంబైలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రముఖ నటుడు ధురంధర్ ఫేమ్ రాకేష్ బేడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సినీ కళాకారులకు ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టైగర్ ష్రాఫ్, ఆయన తండ్రి జాకీ ష్రాఫ్ ఎంతో మర్యాదస్తులని, వివాదాలకు దూరంగా ఎవరి పని వారు నిశ్శబ్దంగా చేసుకునే వ్యక్తులని ఆయన కొనియాడారు. అలాంటి మంచి వ్యక్తులపై ఎందుకు దాడి జరిగిందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. నటులు, గాయకులు, నర్తకులు వంటి కళాకారులందరూ సమాజంలో సులభమైన లక్ష్యాలు (Soft Targets)గా మారుతున్నారని, ఎప్పుడూ భద్రత మధ్యే తిరగడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత భద్రతతో పాటు ప్రభుత్వాలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు రంగంలోకి దిగి ఆర్టిస్టుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాకేష్ బేడీ కోరారు.
ఆదివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో ముంబైలోని జుహు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ ముగించుకుని తన బీఎండబ్ల్యూ కారులో ప్రైవేట్ ఈవెంట్ నుంచి ఇంటికి బయలుదేరిన టైగర్ ష్రాఫ్ కారును ముగ్గురు దుండగులు మోటార్ సైకిల్‌పై వచ్చి లక్ష్యంగా చేసుకున్నారు. కారుపైకి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో టైగర్ ష్రాఫ్ డ్రైవర్ సహా మరో వ్యక్తి గాయపడ్డారు. అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో టైగర్ ష్రాఫ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారు. సంఘటన స్థలానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముంబైలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయగా, సినీ ప్రముఖులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

