Threads App | సంచలనాలు సృష్టిస్తున్న థ్రెడ్స్.. వారంలోనే 10 కోట్ల డౌన్లోడ్స్
Threads App | ప్రముఖ మెసేజింగ్ యాప్ ట్విట్టర్‌కు పోటీగా మెటా (ఫేస్బుక్ మాతృసంస్థ) రూపొందించిన ‘థ్రెడ్స్’ సంచలనాలు నమోదుచేస్తున్నది. విడుదల చేసిన వారం రోజుల్లోనే ఎకంగా 10 కోట్ల (100 Million Users) మందికి పైగా యూజర్లు థ్రెడ్స్ యాప్‌లో ఖాతాలు తెరవడం విశేషం. ఈ విషయాన్ని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Elliot Zuckerberg) తెలిపారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ ట్విట్టర్‌కు పోటీగా మెటా (ఫేస్బుక్ మాతృసంస్థ) రూపొందించిన ‘థ్రెడ్స్’ సంచలనాలు నమోదుచేస్తున్నది. విడుదల చేసిన వారం రోజుల్లోనే ఎకంగా 10 కోట్ల (100 Million Users) మందికి పైగా థ్రెడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొన్నట్టు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Elliot Zuckerberg) తెలిపారు. ట్విట్టర్‌ను పడగొట్టడమే లక్ష్యంగా మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ యాప్ త్వరలోనే ట్విట్టర్‌ను అధిగమించడం ఖాయమని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ట్విట్టర్‌ను పడగొట్టడమే లక్ష్యంగా..
ట్విట్టర్‌ను ఎలాన్‌మస్క్(Elon Musk) కొనుగోలు చేసిన తర్వాత, రోజుకో కొత్త కండిషన్ తెస్తుండటంతో చికాకులో ఉన్న యూజర్లు.. ఇప్పుడు థ్రెడ్స్‌కు బ్రహ్మరథం పడుతున్నట్టు సమాచారం. ట్విట్టర్‌ను పడగొట్టడమే లక్ష్యంగా వచ్చిన థ్రెడ్స్‌ను మెటా తెలివిగా ఇన్‌స్టాగ్రామ్‌తో లింకు పెట్టింది. ఇన్‌స్టా కూడా మెటాకు చెందిన కంపెనీయే అన్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 200 కోట్లమంది యూజర్లు ఉన్నారు. వీరంతా థ్రెడ్స్‌ను వాడటం మొదలుపెడితే కొన్నిరోజుల్లోనే ట్విట్టర్‌ను థ్రెడ్స్ అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసమే ఇన్‌స్టాతో లింకు పెట్టినట్టు భావిస్తున్నారు. థ్రెడ్స్ యూజర్ ప్రొఫైల్ ఇన్‌స్టా ప్రొఫైల్‌లో భాగంగా ఉంటుంది. థ్రెడ్స్‌లో రాసే సందేశాలను ఇన్‌స్టాలోకి పంపుకోవచ్చు. సమస్యల్లా మనకు నచ్చకపోతే థ్రెడ్స్ అకౌంట్‌ను డిలీట్ చేస్తే మాత్రం.. ఇన్‌స్టా అకౌంట్ కూడా దానంతట అదే డిలీట్ అయిపోతుంది. దీంతో ఒక్కసారి థ్రెడ్స్‌లో లాగిన్ అయిన యూజర్ ఇన్స్టాకోసమైనా సచ్చినట్టు దీనిని కొనసాగించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
500 అక్షరాలు రాసుకోవచ్చు
థ్రెడ్స్‌ను వాడుతున్న యూజర్లలో చాలామంది ఇది కూడా ట్విట్టర్‌లాగే ఉన్నదని చెప్తున్నారు. సందేశాలు రాయటం, వీడియోలు పోస్ట్ చేయటం వంటివి ట్విట్టర్‌ను తలపిస్తున్నాయని చెప్తున్నారు. ట్విట్టర్లో ఒక ట్వీట్‌కు 280 అక్షరాల పరిమితే ఉండగా, థ్రెడ్స్‌లో 500 అక్షరాల వరకు ఒక థ్రెడ్‌ను రాసుకొనేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో 5 నిమిషాల నిడివికి మించకుండా వీడియోలను కూడా పోస్ట్ చేసుకోవచ్చు. అయితే, మొదటిరోజు వీడియోలు పోస్ట్ చేయటంలో సమస్యలు ఎదుర్కొన్నట్టు కొందరు యూజర్లు తెలిపారు. ఇక ఇందులో రాసే సందేశాలను థ్రెడ్స్ అని పిలుస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

