Life style | ఆ పని అయిపోగానే కొన్ని పనులు చేయకూడదట.. అవేంటో తెలుసా..?
Life style | శృంగారం అనేది రెండు మనసులకు ఒక మధురమైన భావన. రెండు శరీరాలకు ఒక అపురూపమైన వ్యాయామం. భార్య, భర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంతో శృంగారానిది కీలకమైన పాత్ర. ఈ శారీరక కలయిక ఇద్దరి మధ్య విడదీయరాని మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది.
Life style : శృంగారం అనేది రెండు మనసులకు ఒక మధురమైన భావన. రెండు శరీరాలకు ఒక అపురూపమైన వ్యాయామం. భార్య, భర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంతో శృంగారానిది కీలకమైన పాత్ర. ఈ శారీరక కలయిక ఇద్దరి మధ్య విడదీయరాని మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇంతటి పవిత్రమైన శృంగార కార్యం తర్వాత చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సబ్బుతో కడగవద్దు
శృంగారం తర్వాత స్త్రీలు తమ రహస్య భాగాలను సబ్బుతో కడగవద్దట. ఎందుకంటే శృంగారం తర్వాత స్త్రీల రహస్య భాగాల్లో కండరాలు సడలి ఉంటాయి కాబట్టి వెంటనే సబ్బుతో కడగటంవల్ల ఆ ప్రాంతంలో వాపు, పొడిబారడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. కొంతమంది శృంగారం పూర్తయిన వెంటనే సబ్బుతో కడుగుతుంటారు. అయితే ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముందుగా నీళ్లతో ఓ అరగంట తర్వాత సబ్బుతో శుభ్రం చేసుకోవచ్చట.
మూత్ర విసర్జన వెంటనే వద్దు
శృంగారం తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేయవద్దట. రహస్య భాగాల్లోని కండరాలు సడలి యథాస్థితికి రాకముందే మూత్ర విసర్జన చేయడంవల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందట. అలాగని చాలాసేపటి వరకు మూత్రవిసర్జన చేయకుండా కూడా ఉండవద్దట. శృంగారం అయిపోగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల తర్వాత తప్పకుండా మూత్ర విసర్జన చేయాలట. చాలాసేపటిదాకా మూత్రవిసర్జన చేయకపోయినా ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం పొంచి ఉందట.
చేతులు తప్పక కడగాలి
శృంగారం సమయంలో స్త్రీ పురుషులిద్దరూ ఒకరి జననాంగాలను ఒకరు తాకడం సహజం. కాబట్టి కలయిక పూర్తవగానే తప్పకుండా చేతులు కడుక్కోవాలట. లేదంటే చాలామందిలో బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందట.
వెంటనే వేడి నీటి స్నానం వద్దు
శృంగారం పూర్తయిన వెంటనే స్త్రీలు వేడి నీటితో స్నానం చేయడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా వేడి నీటితో స్నానం చేయడం అనర్థమని అంటున్నారు. శృంగారం తర్వాత స్త్రీ రహస్య భాగంలో కండరాలు సడలి ఉంటాయి కాబట్టి.. వేడినీటి వేడి నీటి స్నానాలవల్ల ఆ భాగాల్లో చర్మం కోతకు గురై ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందట. కాబట్టి వేడినీటి స్నానం చేయాలంటే కొంతసేపు ఆగిన తర్వాత చేసుకోవచ్చట.
నీరు తాగాలి
శృంగారంలో దంపతులిద్దరూ అలసిపోతారు. చెమట రూపంలో ఒంట్లోని నీరు అంతా వెళ్లిపోతుంది. కాబట్టి కలయిక తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. దాంతో డీహైడ్రేట్ అయిన శరీరాలు తిరిగి హైడ్రేట్ అవుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బిగుతు దుస్తులు వద్దు
కొంతమంది శృంగార సమయంలో బిగుతు దుస్తులు ధరిస్తారు. కానీ ఆ సమయంలో బిగుతుగా ఉండే బట్టలు అస్సలు ధరించకూడదని నిపుణులు అంటున్నారు. బిగుతు దుస్తులు ధరించడం వల్ల తడి త్వరగా ఆరక ఇన్ఫెక్షన్లు, దురదలు లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి శృంగారం తర్వాత తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం మంచిదని సూచిస్తున్నారు.
వెంటనే నిద్రవద్దు
శృంగారం తర్వాత కొందరు వెంటనే నిద్రలోకి జారుకుంటారు. కానీ అలా వెంటనే నిద్రపోవద్దని నిపుణులు చెబుతున్నారు. కనీసం ఒక 30 నిమిషాలపాటు బెడ్పైనే మెలుకువగా ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఎందుకంటే శృంగారం సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుందట. కాబట్టి అరగంట విశ్రాంతి తీసుకుంటే శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడి శరీరం రిలాక్స్ అవుతుందట. కావాలంటే అప్పుడు నిద్రపోవచ్చట.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

