అప్పుడు కూతురు.. ఇప్పుడు తండ్రి
- ఇద్దరినీ కోల్పోయిన బరోడా క్రికెటర్ విష్ణు
వడోదర: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి మరోమారు తీరని శోకంలో మునిగిపోయాడు. పదిరోజుల క్రితం అప్పుడే పుట్టిన కూతురిని కోల్పోయిన సోలంకి.. తనను పెంచి పెద్ద చేసిన తండ్రి ఆదివారం కన్నుమూశాడు. రంజీ ట్రోఫీ కోసం ప్రస్తుతం కటక్‌లో ఉన్న సోలంకి… తండ్రి ఆఖరి చూపులకు నోచుకోలేకపోయాడు. వీడియోకాల్ ద్వారా తండ్రి అంత్యక్రియలను చూడటం అందరినీ కలిచివేసింది. కొన్ని రోజుల వ్యవధిలో కూతురుతో పాటు తండ్రిని కోల్పోయిన సోలంకి గురువారం నుంచి హైదరాబాద్‌తో మొదలయ్యే కీలకమైన మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఇద్దరు ఆప్తులను దూరం చేసుకుని కడు దుఃఖంలో ఉన్న సోలంకి తన బాధనంతా దిగమింగుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇదిలా ఉంటే గతనెల 10న జన్మించిన విష్ణు కూతురు ఒక రోజు తేడాతో కన్నుమూసింది. చిన్నారి అంత్యక్రియలకు హాజరై తిరిగి వచ్చిన సోలంకి..చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ(104)తో అదరగొట్టాడు. క్లిష్ట సమయంలో చేసిన శతకాన్ని తన కూతురుకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. చిన్నారి మరణం నుంచి తేరుకుంటున్న సమయంలోనే తండ్రి మరణవార్త.. సోలంకిని మరింత కుంగదీసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

