ఆనందమా.. నువ్వెక్కడా?
ఆనందం చిరునామా ఏమిటి? పిన్‌కోడ్ ఎంత? ఆన్‌లైన్‌లోనూ లభిస్తుందా? టెన్ మినిట్స్ డెలివరీ ఆప్షన్ ఉందా? అసలు దాని మూలాలెక్కడ? హిమాలయ సానువుల్లోనా, సాగర తీరాల్లోనా? ఇష్టపడేవారి సాన్నిధ్యంలోనా, కష్టపడి గెలుచుకున్న కప్పులోనా? వెండితెర నటుల నుంచి బంగారు పతకాల విజేతల వరకు.. ఎవరి నిర్వచనం వారిది.
ఆనందం చిరునామా ఏమిటి? పిన్‌కోడ్ ఎంత? ఆన్‌లైన్‌లోనూ లభిస్తుందా? టెన్ మినిట్స్ డెలివరీ ఆప్షన్ ఉందా? అసలు దాని మూలాలెక్కడ? హిమాలయ సానువుల్లోనా, సాగర తీరాల్లోనా? ఇష్టపడేవారి సాన్నిధ్యంలోనా, కష్టపడి గెలుచుకున్న కప్పులోనా? వెండితెర నటుల నుంచి బంగారు పతకాల విజేతల వరకు.. ఎవరి నిర్వచనం వారిది.
పరుగులో వెతుక్కుంటా..
హిమా దాస్ , అథ్లెట్

నాకు పరుగెత్తడంలో ఆనందం ఉంది. పతకం బోనస్ మాత్రమే. నా శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి పరుగు ఓ కొలమానం. ఒక్క క్షణం వెనుకబడినట్టు అనిపించినా.. నాకు నేను సవాలు విసురుకుంటాను. మరింత మెరుగ్గా పరిగెడతాను. ప్రకృతి ఒడిలో కాలం గడపడమూ ఇష్టమే. ఈశాన్య భారతం నుంచి వచ్చిన నాలాంటి వాళ్లు పచ్చదనంలో పరమానందాన్ని వెతుక్కుంటారు. చుట్టూ ఇష్టమైన వాళ్లు ఉంటే మహదానందంగా అనిపిస్తుంది. ఆత్మీయుల కోసం వంట చేయడంలో కూడా తీయని ఆనందం ఉంది.
మానసికమైంది..
రకుల్ ప్రీత్ సింగ్, నటి

నేను చెబుతున్న విషయం మరీ ఆధ్యాత్మికంగా అనిపించవచ్చు. నా మాటల్లో వయసుకు మించిన ఆలోచనలు తొంగిచూస్తున్న భావన కలగవచ్చు. కానీ ఆనందం అనేది పూర్తిగా అంతర్గతమైనదని, మనసు పొరలకు సంబంధించిన ఉద్వేగమని నమ్ముతాను. ఆనందానికి బయటి ప్రపంచంతో సంబంధం లేదు. భౌతిక వస్తువుల అవసరమే లేదు. సినిమా విజయం సాధిస్తే.. మురిసిపోవడం, సరిగా ఆడకపోతే కుంగిపోవడం.. ఇవన్నీ చిన్నచిన్న విషయాలు. జయాపజయాలకు అతీతమైన స్థితే ఆనందం.
ఎదుటివారి చిరునవ్వులో
మల్లికా సారాభాయ్, నాట్యకారిణి

నా దృష్టిలో ఆనందం అనేకానేక ఉద్వేగాల జుగల్బందీ. ఆరోగ్యంగా ఉండటం.. శరీరానికి చక్కటి వ్యాయామాన్ని, మంచి ఆహారాన్ని అందించడం.. ఫిట్‌గా ఉండటం.. పేదలకు సాయపడటం.. తోటి మనిషి మొహంలో చిరునవ్వులు చూడటం.. ఇంతే, ఇంతకు మించిన ఆనందం ఏం ఉంటుందీ? నా నృత్యానికి థియేటర్లో అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టినా సరే.. ఆ ఆనందం నాకు క్షణికమే అనిపిస్తుంది. ఆనందం పోగేసుకుంటే పెరిగేది కాదు. పంచుకునేకొద్దీ రెండింతలయ్యేది. అది ప్రేమతో ముడిపడిన అతిసున్నిత ఉద్వేగం.
ఒకే సూత్రం..
రిచా చద్దా, నటి

ఎనిమిది గంటల చక్కటి నిద్ర, మంచి పోషకాహారం, అపోహలు లేని అనుబంధాలు.. నా దృష్టిలో ఇవే ఆనందం అంటే. అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితి వేధిస్తుంటే.. ఎక్కడో తేడా ఉన్నట్టు. మనల్ని మనం బేరీజు వేసుకోవాల్సిన సమయం వచ్చినట్టు. అవసరమైతే డాక్టరును సంప్రదించడంలో తప్పులేదు. ఆనందానికి, మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉంది. ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. అపోహలు, భయాలు, అభద్రతలు మనిషిని ఆనందానికి దూరం చేస్తాయి. విషాదాల ఊబిలోకి తోసేస్తాయి.
నాట్యంలో మునిగిపోతే..
యామినీ రెడ్డి, నాట్యకారిణి

నాట్యంలో నాకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. గంటలకొద్దీ సాధన చేస్తున్నప్పుడు.. నా తనువు అలసిపోతుంది. కానీ మనసు మాత్రం చైతన్యంగా ఉంటుంది. పరిసరాల నుంచి విడిపోతుంది, అలౌకిక ఆనంద స్థితికి చేరుతుంది. బ్రహ్మానందం అంటే అదే కావచ్చు. ఆ వేళలో నేను సంపూర్ణత్వ భావనలో ఓలలాడుతుంటాను పరమాత్మకు చేరువైన అనుభూతి కలుగుతుంది. నృత్యం ఒక సృజనాత్మక ప్రక్రియ. దాన్ని నలుగురికీ పంచడం కూడా ఆనందాన్నిచ్చే విషయమే. ఆనందం గురించి మాట్లాడినా ఆనందమే.
విజయాన్ని చేరడమే..
నిఖత్ జరీన్, బాక్సర్

కష్టపడి సాధన చేయడం, గెలుపు సాధించడం.. నాకు ఆనందాన్నిచ్చే విషయాలు. నా జీవితంలో అత్యంత ఆనందకర క్షణం.. ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించడం. ఆ వేదిక మీద భావోద్వేగానికి గురయ్యాను. నా శ్రమకు, త్యాగాలకు ఫలితం అందినట్టు భావించాను. పతకంతో నా జీవితం మారిపోయింది. గెలుపు వల్ల నా కల నెరవేరింది. నా అభిమాన నటుడు సల్మాన్ ఖాన్‌నూ కలవ గలిగాను. ఇవన్నీ ఆనందపు ఆనవాళ్లే. కానీ మనం ఆనందం వెనకాల కాకుండా.. లక్ష్యం వెంట పడాలి. విజయంతోపాటే ఆనందమూ దక్కుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- happiness
- life
- true meaning
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

