న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం వల్ల ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్లో 3.4 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) ప్రకారం పెరుగుతున్న ఇంధన ధరలు, గగనతల అంతరాయాలు, భద్రతా ఆందోళనలు విమానయాన సంస్థల కార్యకలాపాలకు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి.
శుక్రవారం ఐఏటీఏ విడుదల చేసిన డాటా ప్రకారం పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఆ ప్రాంతంలో ప్రయాణికుల డిమాండ్ 46.6 శాతానికి తగ్గింది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల డిమాండ్ -3.4 శాతానికి తగ్గింది.