చెరువుల లీజుకు పాత ధరలే
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
- మత్స్యకారులకు ఉగాది కానుక
- మంత్రి తలసాని శ్రీనివాస్
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని చెరువుల్లో చేపల పెంపకం, చేపల వేటపై యాజమాన్య హక్కులను జీవో 268 ద్వారా మత్స్యశాఖకు బదిలీ చేసింది. గతంలో శాశ్వత నీటి సౌకర్యం గల చెరువులకు హెక్టారుకు రూ.400, ఎక్కువ కాలం నిల్వ ఉంటే రూ.400, తక్కువ కాలం నీరు నిల్వ ఉంటే రూ.60 చొప్పున లీజు నిర్ణయించారు. ఇప్పుడు కూడా అదే లీజు కొనసాగించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా 4,793 మత్స్య సొసైటీల్లోని 3.54 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనున్నది. పాత లీజు కొనసాగింపు నిర్ణయంపై మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హర్షం ప్రకటించారు. మత్స్యకారులకు సీఎం కేసీఆర్ ఉగాది కానుకను ఇలా ముందే అందజేశారని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

