అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకత్వంలో ఆర్.ఎమ్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అమ్మ లాంటి ఆవును కాపాడుకోలేకపోతే మనుగడ లేదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. కథలోని సందేశం ప్రేక్షకులకు చేరువైంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నిరూపించింది’ అన్నారు. ‘కథలో కొత్తదనంతో పాటు విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. మంచి కథాంశంతో తెరకెక్కిన సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని కథానాయిక భానుశ్రీ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.