ఆర్టీసీ బస్సులో మంటలు..
గ్రామస్తుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

తాండూర్ : తాండూర్ మండలం బోయపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి ఆర్టీసీ బస్సులో
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రామస్తులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల నుంచి కాగజ్నగర్ వెళ్తున్న మంచిర్యాల డిపో పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు బోయపల్లి గ్రామ శివారుకు వచ్చే సరికి బ్యాటరీలో షార్ట్ సర్క్యుట్తో మంటలు చెలరేగాయి. డ్రైవర్ దీనిని గమనించకుండానే బస్సును నడపడంతో అక్కడే ఉన్న గ్రామస్తులు మంటలు గమనించి బస్సు వెంట పరిగెత్తి డ్రైవర్ను అప్రమత్తం చేశారు.
దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి చాకచక్యంగా బ్యాటరీల కనెక్షన్ తొలగించారు. గ్రామస్తుల సహకారంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే బస్సులో నుంచి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపివేశారు. ఈ ప్రమాదంలో మంటలు ఆర్పి వేసిన అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ప్రయాణికులను కాపాడిన బోయపల్లి గ్రామస్తులకు పలువురు అభినందనలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

