బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్ సంస్థలో సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్బు చెరుకూరి దర్శకుడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. ‘ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా..’ అనే డైలాగ్తో ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. ‘మోనోఫోబియాతో బాధపడుతున్న ఓ రచయిత కథతో సినిమా తెరకెక్కిస్తున్నాం, ఒక ప్రమాదం తీసుకొచ్చిన సమస్యను అతను ఎలా అధిగమించాడు అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది’అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం : ఎంఎస్ జోన్స్ రూపెర్ట్, సినిమాటోగ్రఫీ : మోహన్ చారి.