దివంగతనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పురచ్చితలైవిగా ఖ్యాతిగాంచిన సంగతి మనందరికి తెలిసిందే. సినీ, రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న జయలలిత కన్నడ నాట జన్మించి తమిళనాడులో స్థిరపడింది. అన్నాడీఎంకే అధినేత్రిగా, తమిళనాడు సీఎంగా ఆమె ఎదిగిన తీరు అద్భుతం. 1991 నుంచి 2016 వరకు 14 ఏళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత.. తమిళులతో ‘అమ్మ’ అని పిలిపించుకునేంత స్థాయికి చేరుకున్నారు.
జయలలిత జీవిత నేపథ్యంలో.. కంగనా రనౌత్ తలైవీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు జయ బర్త్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ప్రతి సన్నివేశం ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంది. జయలలితగా కంగనా పూర్తిగా ఒదిగిపోయింది. దర్శకుడు విజయ్ చాలా గ్రాండియర్‌గా ట్రైలర్‌ను కట్ చేయించారు. ట్రైలర్ చూస్తుంటే జయలలిత సినీ, రాజకీయాన్ని చాలా చక్కగా వెండితెరపై చూపించనున్నట్టు అర్దమవుతుంది. ఎం జి ఆర్ రోల్ లో నటించిన టాలెంటెడ్ నటుడు అరవింద స్వామి ఆ రోల్ లో కరెక్ట్ గా సెట్టయ్యి మరో బిగ్ ఎస్సెట్ గా కనిపిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ రచన, జీవీ ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. తలైవీ ట్రైలర్ అభిమానులకు మంచి ఫీస్ట్ అని చెప్పడంలో సందేహం లేదు. విష్ణు వర్ధన్ ఇందూరి మరియు శైలేష్ ఆర్ నిర్మాణం వహించిన ఈ భారీ చిత్రం వచ్చే ఏప్రిల్ 23న గ్రాండ్ గా విడుదల కానుంది.