Telugu Language Day | సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలుగు భాష వికాసం : ఎంపీ సంతోష్
Telugu Language Day | సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలుగు భాష వికాసం : ఎంపీ సంతోష్ | సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ఆదివారం తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ఆదివారం తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గురించి, ఆయనకున్న సాహితీ సంపద గురించి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘వేల పుస్తకాలు ఔపోసన పట్టిన ఘన వ్యక్తిత్వం, తెలుగు భాష పట్ల అనన్యసామాన్యమైన ప్రేమ, వెరసి మా పెదనాన్న, మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. వీరి సారధ్యంలో తెలుగు భాష మరింతంగా వికసిస్తుందనడంలో సందేహం లేదు’ అని ట్వీట్ చేశారు.

రాజకీయ రంగంలోనే కాదు సాహితీరంగంలోనూ తనకంటూ ప్రత్యేకతను సాధించిన సీఎం కేసీఆర్. ఓ వైపు పాలనలో నిత్యం బిజీగా ఉంటూనే.. వీలు దొరికినప్పుడల్లా తెలుగు కవిత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంటారని, ఆ సాహితీ సౌరభాలను తను ఆస్వాదిస్తూనే నలుగురికి పంచుతుంటారన్నారు. ఓ చేత్తో కత్తిని మరో చేతితో కలాన్ని పట్టిన గతకాలపు చక్రవర్తులకు ప్రతీక సీఎం కేసీఆర్ అన్నారు. ఎంత సమర్థవంతంగా పాలన నిర్వహిస్తారో.. అంతే సమర్థంగా సాహితీ సమావేశాలను రక్తి కట్టిస్తారని చెప్పారు. స్వరాష్ట్ర సాధన కోసం స్వయంగా పాటలు రాసిన ఘనత ఆయన సొంతమని, సీఎం కేసీఆర్‌కు పాటలే కాదు పద్యాలన్నా మక్కువ ఎక్కువ అన్నారు.
ఎలాంటి కఠిన పదాలు కలిగిన పద్యాన్నైనా అవలీలగా పాడుతారని, తెలుగు ప్రపంచ మహాసభల్లో సీఎం కేసీఆర్ పాడిన పద్యాలు పండితుల నుంచి పామరుల దాకా అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పారు. రాజకీయం అంటే ఎంతసేపూ వ్యూహ ప్రతివ్యూహాలే కాదు గ్రంధ ప్రబంధాల పఠనం కూడా అని నిరూపించే అతి కొద్ది నాయకుల్లో కేసీఆర్ ఒకరని, అమితమైన ప్రజాకర్షణ, వాగ్ధాటి, వాక్షుద్ధి, మధ్య మధ్య చెణకులు, ఛలోక్తులు, సామెతలు, జాతీయాలు వెరసి ఇంకాసేపు మాట్లాడితే బాగుండు.. అనే శైలి సీఎం కేసీఆర్ అని చెప్పారు. పద్యమైనా, గద్యమైనా.. ప్రబంధమైనా.. సీఎం కేసీఆర్ పదకోశం.. ఒక సాహితీ సంద్రమని, సరస్వతీ దేవిని చూడగానే.. ఒక సాహిత్యాభిమానిగా అవధులు లేని ఆనందాన్ని ప్రకటించడం ఆయనకే సొంతమన్నారు.
వేల పుస్తకాలు ఔపోసన పట్టిన ఘన వ్యక్తిత్వం, తెలుగు భాష పట్ల అనన్యసామాన్యమైన ప్రేమ, వెరసి మా పెదనాన్న, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. వీరి సారధ్యంలో తెలుగు భాష మరింతంగా వికసిస్తుందనడంలో సందేహం లేదు.#తెలుగుభాషాదినోత్సవం శుభాకాంక్షలు.@MVenkaiahNaidu pic.twitter.com/5Vk2p07ejF
— Santosh Kumar J (@SantoshKumarBRS) August 29, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

