సెప్టెంబరు 2, 2026 నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయింది. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ముఖ్యంగా నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. ఖాళీలను బట్టి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, తెలంగాణను జీరో నిరుద్యోగ రాష్ట్రంగా చేస్తామని చెప్పింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 1000 రోజుల్లో 5లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ రేవంత్ సర్కారు ఇచ్చిన ఉద్యోగాలు 16,978 ఉద్యోగాలు మాత్రమే. చేప్పింది చేయని రెవంత్ సర్కారును బరాబర్ నిలదిస్తాం.. బరిగీసి కొట్లాడతాం.. అని తెలంగాణ యువత పిడికిలి బిగిస్తోంది.