సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ : ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.
జగిత్యాల: దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలో జిల్లా దివ్యాంగుల ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు రూ. 3వేలు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. దివ్యాంగులను సకలాంగులు పెండ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మితో పాటు అధనంగా రూ. లక్ష అందజేస్తున్నామని పేర్కొన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో దివ్యాంగులకు త్రీ వీలర్ స్కూటీలు, మోటారైజ్డ్ ట్రైసైకిళ్లు, ఇతర పరికరాలు అందజేస్తున్నామని వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ బందు సత్యం,నాయకులు లంక దాసరి శ్రీనివాస్, అశ్ఘర్ ఖాన్, ప్రవీణ్,సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

