బ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
ఇంటర్ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి 24 నుంచి, ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ సారి ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్స్ సైతం నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
-
ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్
-
తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి 24 నుంచి, ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ సారి ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్స్ సైతం నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు.
ఫీజు కట్టింది 10 శాతమే..
ఇంటర్ ఎగ్జామ్ ఫీజు ఇప్పటి వరకు 10% విద్యార్థులు మాత్రమే చెల్లించారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 9తో ముగియనున్నది. ఆ తర్వాత రూ. 100తో ఈ నెల 21, రూ. 500 ఆలస్య రుసుముతో ఈ నెల 30, రూ. వెయ్యి ఆలస్య రుసుముతో డిసెంబర్ 8, రూ. 2 వేల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించే అవకాశముంది. ఇంటర్ పరీక్షలకు కొత్త నామినల్ రోల్, ఇంటర్నల్ అసెస్మెంట్ కోడ్స్, ప్రాక్టికల్ పరీక్షల కోడ్స్‌ను ఇంటర్ విద్యామండలి కేటాయించింది. సబ్జెక్టులవారీగా ఇంటర్నల్ అసెస్మెంట్ కోడ్స్ కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది.
13 వరకు ఇంటర్ అడ్మిషన్లు
ఇంటర్ అడ్మిషన్లకు ఈ నెల 13 వరకు అవకాశం కల్పించింది. రూ. వెయ్యి ఆలస్య రుసుముతో ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ కాలేజీల్లో ఆలస్య రుసుము తీసుకోరు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

