సాహసమే ఆమె ఊపిరి. సైన్యంలో పనిచేయాలనేది ఆమె లక్ష్యం. అందుకావాల్సిన శక్తిసామర్థ్యాలను కూడగట్టు కునేందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఎవరెస్ట్ అధిరోహణ. ఇందులో భాగంగా మొదట కిలిమంజారోపై అడుగిడింది కొత్తకాపు అశ్రుహ.. భువనగిరి కోట నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఆఫ్రికాలోని కిలిమంజారో పైకి చేరుకొన్నది. ఇక తన తదుపరి లక్ష్యం.. ఎవరెస్ట్ శిఖరమేనని ఎలుగెత్తి చెబుతున్నది.