Telangana Classic Body Building : తెలంగాణలోని యువ బాడీ బిల్డర్లకు గుడ్ న్యూస్. తెలంగాణ క్లాసిక్, బాడీ బిల్డింగ్ 2024 పోటీలకు కౌంట్‌డౌన్ మొదలైంది. గచ్చిబౌలిలోని అథ్లెటిక్ స్టేడియం(Athletic Stadium)లో ఈ పోటీలు ఫిబ్రవరి 19న షురూ కానున్నాయి. ఈ కాంపిటీషన్‌తో పాటు సీనియర్ 15 మిస్టర్ ఇండియా ట్రయల్స్ కూడా జరుగుతాయి. టైటిల్ విన్నర్‌కు 50 వేల ప్రైజ్‌మనీ అందజేయనున్నారు.
మాజీ మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ రవి కుమార్(Ravi Kumar) ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఫిబ్రవరి 18 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు రూ. 3000. స్టేడియానికి వెళ్లి ఫీజు చెల్లించి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9908197123 నంబర్‌కు ఫోన్ చేయగలరు.
తెలంగాణ క్లాసిక్, బాడీ బిల్డింగ్ పోటీలు మూడు విభాగాల్లో జరుగనున్నాయి. బాడీ బిల్డింగ్ కేటగిరీలో 55, 60, 65,70, 75, 80, 85, 90, 95, 100 కిలోల వాళ్లు పోటీ పడొచ్చు. క్లాసిక్ బాడీ బిల్డింగ్‌లో పాల్గొనేవాళ్ల ఎత్తు 5 అడుగుల 7 ఇంచులు ఉంచాలి. పురుషుల ఫిజిక్ విభాగంలో పోటీ పడేవాళ్లకు ఫిజిక్ 170 సెంటీమీటర్లు ఉండాలి.